ఇంగ్లండ్‌పై పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. ఒక్క రోజే 55 మంది మృతి

  • ఇంగ్లండ్‌లో 177కు పెరిగిన మృతుల సంఖ్య
  • యూకే షట్‌డౌన్
  • ప్రపంచవ్యాప్తంగా 13 వేలు దాటిన మరణాలు
చైనాను వదిలి యూరప్‌లో అలజడి సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఇంగ్లండ్‌పై ప్రతాపం చూపిస్తోంది. శనివారం ఒక్కరోజే 55 మంది మృతి చెందారు. దీంతో ఆ దేశంలో కరోనా మహమ్మారికి బలైనవారి సంఖ్య 177కు చేరింది. దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం దేశవ్యాప్తంగా షట్‌డౌన్ అమల్లోకి తీసుకొచ్చింది.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. వైరస్ నియంత్రణకు భారత్ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుండగా, చాలా దేశాలు షట్‌డౌన్ ప్రకటించాయి. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 13 వేలు దాటిపోగా, బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. దాదాపు 96 వేల మంది కోలుకున్నారు.

England
Corona Virus
Shut down
corona deaths
UK

More Telugu News